TDP: గుబురు గెడ్డంతో మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి... ఫొటో ఇదిగో

this is the new profilepicof tdp leader N Amarnath Reddy
  • నిత్యం క్లీన్ షేవ్‌తోనే క‌నిపించే అమ‌ర్‌నాథ్ రెడ్డి
  • గుబురు గెడ్డం ఫొటోనే ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్న మాజీ మంత్రి
  • టీడీపీ నుంచి వైసీపీలోకి చేరి తిరిగి సొంత గూటికి చేరిన ప‌ల‌మ‌నేరు నేత‌
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి నిత్యం క్లీన్ షేవ్‌తోనే క‌నిపించేవారు. ఇటీవ‌లి కాలంలో కాస్తంత ర‌ఫ్ లుక్‌లోకి మారిపోయిన ఆయ‌న‌... ఓ మోస్త‌రు గెడ్డంతో క‌నిపిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఏకంగా గుబురు గెడ్డంతో క‌నిపిస్తున్నారు. ఎన్నో రోజులుగా గెడ్డం గీయ‌కుండా ఉండిపోయిన అమ‌ర్‌నాథ్ రెడ్డి... గుబురు గెడ్డంతో ఉన్న త‌న ఫొటోను త‌న సోష‌ల్ మీడియా ప్రొఫైల్ పిక్‌గా ఎంపిక చేసుకున్నారు. ఈ ఫొటో అందరిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

టీడీపీ నుంచే రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన అమ‌ర్‌నాథ్ రెడ్డి 2014 ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా వైసీపీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత వైసీపీని వీడిన అమ‌ర్‌నాథ్ రెడ్డి... తిరిగి త‌న సొంత గూడైన టీడీపీలోకి చేరారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగానూ ఆయ‌న ప‌నిచేశారు. వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌పై టీడీపీ త‌ర‌ఫున గొంతెత్తుతున్న నేత‌ల్లో ముఖ్యుడిగా అమ‌ర్‌నాథ్ రెడ్డి గుర్తింపు సంపాదించారు.
TDP
N Amarnath Reddy
Chittoor District
Palamaneru

More Telugu News