తిరిగొస్తే రాజగోపాల్ రెడ్డికే టికెట్ ఇస్తాం... అందరం కలిసి ఆయనను గెలిపించుకుంటాం: రేవంత్ రెడ్డి
- రాజగోపాల్ రెడ్డికి బంపర్ ఆఫర్ ప్రకటించిన రేవంత్
- బీజేపీలో ఆ పార్టీ కండువా కప్పుకున్నప్పుడే పండగ అని విమర్శ
- అద్వానీ, వెంకయ్యల పరిస్థితే అందుకు నిదర్శనమన్న టీపీసీసీ చీఫ్
- స్టార్ క్యాంపెయినర్ హోదాలో వెంకట్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటారని వెల్లడి
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా శనివారం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఆ పార్టీ కండువా కప్పుకున్నప్పుడే పండగ అని వ్యాఖ్యానించిన రేవంత్... బీజేపీలో ఎల్కే అద్వానీ, వెంకయ్యనాయుడుల పరిస్థితి అందుకు నిదర్శనమని తెలిపారు. పార్టీ మారి బీజేపీలోకి వెళ్లిన చాలా మంది సీనియర్ నేతలకు సరైన ప్రాధాన్యమే దక్కలేదని ఆయన అన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి... ఎన్నికల ప్రచారంలో వెంకట్ రెడ్డి తప్పనిసరిగా పాలుపంచుకుంటారని చెప్పారు.