Bsnl: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్.. రూ.275

BSNL Independence Day 2022 Offer Get 75 Days of Broadband Service at Rs 275

  • 75 రోజుల వ్యాలిడిటీ
  • ఆ తర్వాత నుంచి సాధారణ చార్జీలు
  • రూ.449, రూ.599 ప్లాన్ లకు ఇది వర్తింపు
  • రూ.999 ప్లాన్ కు రూ.775 చార్జీ

ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై ఎక్కువ దృష్టి పెట్టింది. మొబైల్ టెలిఫోనీ సేవల విషయంలో ప్రైవేటు సంస్థలతో పోటీ పడలేకపోతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ.. బ్రాడ్ బ్యాండ్ లో తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.275 రూపాయలకే 75 రోజుల పాటు ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ఆఫర్ చేస్తోంది. 

కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది. నిజానికి బీఎస్ఎన్ఎల్ లో రూ.275 రూపాయలతో రెగ్యులర్ బ్రాడ్ బ్యాండ్ నెలవారీ ప్లాన్ ఏదీ లేదు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ ఆఫర్ ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ నెలవారీ ఆరంభ ప్లాన్ రూ.449. ఇప్పుడు ఆఫర్ లో భాగంగా ఈ ప్లాన్ లో చేరి మూడు నెలల పాటు సేవలను రూ.275కే పొందొచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా రూ.449 చెల్లించాల్సి ఉంటుంది. 

అలాగే, రూ.599 రెగ్యులర్ ప్లాన్ ను సైతం 75 రోజుల పాటు రూ.275కే అందిస్తోంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా రూ.599 చార్జ్ చేస్తారు. ఇక రూ.999 ప్లాన్ తీసుకుంటే.. ఆఫర్ కింద 75 రోజులకు రూ.775 చెల్లిస్తే చాలు. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా రూ.999 చెల్లించాలి.  

రూ.449 ప్లాన్ కింద 30 ఎంబీపీఎస్ స్పీడ్ వేగంతో నెట్ సేవలు పొందొచ్చు. నెలవారీ 3.3 టీబీ డేటా వరకు ఈ స్పీడ్ అమలవుతుంది. ఆ తర్వాత 2 ఎంబీపీఎస్ కు వేగం తగ్గుతుంది. రూ.599 ప్లాన్ లో 60 ఎంబీపీఎస్ వేగంతో డేటా సేవలు లభిస్తాయి. నెలవారీ 3.3టీబీ డేటా పరిమితి దాటితే, తర్వాత నుంచి 2 ఎంబీపీఎస్ కు వేగం తగ్గుతుంది. రూ.999 ప్లాన్ లో 150 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలు లభిస్తాయి. 2 టీబీ డేటా వరకు ఈ వేగ పరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ లో ఓటీటీ యాప్స్ కూడా ఉచితం.

Bsnl
Broadband
best plans
Independence Day offer
Rs 275
  • Loading...

More Telugu News