Amazon: అభ్యంతరకరంగా దేవుళ్ల ఫొటోల విక్రయాలు.. అమెజాన్ పై ఫిర్యాదు

Complaint against Amazon over obscene Radha Krishna painting

  • రాధా కృష్ణుల అభ్యంతరకార ఫొటోల విక్రయాలు
  • అమెజాన్ పై బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు
  • ఎక్సోటిక్ ఇండియాపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్

ట్విట్టర్లో ‘బాయ్ కాట్ అమెజాన్’ బాగా ట్రెండింగ్ అవుతోంది. రాధాకృష్ణుల అభ్యంతరకర రీతిలో ఉన్న ఫొటోలను అమెజాన్ తన ప్లాట్ ఫామ్ పై విక్రయిస్తోందంటూ హిందూ జనజాగృతి సమితి అంటోంది. అమెజాన్ తోపాటు, ఆ పోర్టల్ లో ఫొటోలను విక్రయానికి పెట్టిన సంస్థ ఎక్సోటిక్ ఇండియాపైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ సంస్థ బెంగళూరు సుబ్రమణ్య నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

అభ్యంతరకరంగా ఉన్న దేవుళ్ల ఫొటోలు ఎక్సోటిక్ ఇండియా వెబ్ సైట్ లోనూ ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగడం తెలిసిందే. వివాదం మొదలైన తర్వాత సంబంధిత వెబ్ సైట్ల నుంచి ఈ ఫొటోలను తొలగించారని హిందూ జనజాగృతి సమితి తెలిపింది. 

‘‘కానీ, ఇది చాలదు. అమెజాన్, ఎక్సోటిక్ ఇండియా బేషరతుగా క్షమాపణలు కోరాలి. ఇంకెప్పుడూ హిందువుల మనోభావాలను గాయపరచనంటూ భరోసా ఇవ్వాలి. విలువల్లేని అమెజాన్ తరచుగా జాతీయ, ప్రాంతీయ మత చిహ్నాలను, దేవుళ్లను అగౌరవపరుస్తోంది. అమెజాన్ ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడకుండా భారత్ కఠిన వైఖరి తీసుకోవాలి’’ అని హిందూ జన జాగృతి సంస్థ కోరింది. 

  • Loading...

More Telugu News