Realme: బడ్జెట్ ధరలో రియల్ మీ నుంచి 5జీ ఫోన్

  • 4జీ ఫోన్ కు అప్ డేటెడ్ వెర్షన్ విడుదల
  • రూ.14,999 నుంచి ధరలు ప్రారంభం
  • రెండు రకాల వేరియంట్లు
  • ఆరంభంలో రూ.1,000 డిస్కౌంట్
Realme India launches 5G enabled Realme 9i 5G for the masses

రియల్ మీ సంస్థ 9ఐ 5జీ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్ మీ 9ఐ 4జీ ఫోన్ ఇంతకు ముందే మార్కెట్లో అందుబాటులో ఉంది. 5జీ టెలికం సేవలు త్వరలోనే ప్రారంభం కానుండడంతో, 5జీ వెర్షన్ ను రియల్ మీ తీసుకొచ్చింది. ఈ ఫోన్ 8.1 ఎంఎంతో స్లిమ్ గా ఉంటుంది.

రియల్ మీ 9ఐ 5జీఫోన్.. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.14,999. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.16,999. ఆగస్ట్ 24న రియల్ మీ విక్రయ కేంద్రాలు, ఫ్లిప్ కార్ట్ పై అమ్మకాలు మొదలవుతాయి. ఆరంభంలో కొనుగోలు చేసేవారికి ఈ ధరపై రూ.1,000 తగ్గింపు ఇస్తోంది. సోల్ ఫుల్ బ్లూ, రాకింగ్ బ్లాక్, మెటాలికా గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.

6.6 అంగుళాల స్క్రీన్, ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఉంటుంది. 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. డైమెన్సిటీ 810 చిప్ సెట్ తో వస్తుంది. తొమ్మిది 5జీ బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 18 వాట్ చార్జర్ తో చార్జ్ చేసుకోవచ్చు.

More Telugu News