Ponguleti Srinivasareddy: అంగరంగ వైభవంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక... వీడియో ఇదిగో!

Ponguleti daughter Sapni Reddy wedding reception video
  • అర్జున్ రెడ్డితో పొంగులేటి కుమార్తె సప్నిరెడ్డి వివాహం
  • ఈ నెల 12న ఇండోనేషియాలో పెళ్లి
  • ఖమ్మంలో నేడు రిసెప్షన్
  • ఏడు లక్షల మందికి ఆహ్వానం
  • ప్రతి ఒక్కరికీ పెళ్లికార్డు, గోడ గడియారం అందించిన పొంగులేటి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె సప్నిరెడ్డి, అర్జున్ రెడ్డిల వివాహం ఈ నెల 12న ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జరిగింది. అయితే, పెళ్లి రిసెప్షన్ ను ఖమ్మం ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలోని 100 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. రిసెప్షన్ వేదికనే 30 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు విచ్చేసే అతిథుల వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తన కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు లక్షల కుటుంబాలకు శుభలేఖతో సహా గోడ గడియారం కూడా అందించి ఆహ్వానించారు. 

కాగా, రిసెప్షన్ కోసం రాజస్థాన్ ప్యాలెస్ సెట్టింగ్ ను వేశారు. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఈ సెట్టింగ్ ను నిర్మించారు. మూడు లక్షల మందికి అదిరిపోయే రీతిలో విందు భోజనాలు సిద్ధం చేశారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలకు ప్రసిద్ధిచెందిన యాదమ్మతో పలు వంటకాలు వండించారు. ఈ రిసెప్షన్ కు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో, భద్రత కోసమే 1,500 మంది సిబ్బందిని వినియోగించారు.



Ponguleti Srinivasareddy
Sapni Reddy
Wedding
Reception
Khammam

More Telugu News