Nagababu: బాబూ... ఓ రాంబాబూ... ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా: నాగబాబు

Nagababu interesting comments in Twitter
  • కాటన్ దుస్తుల చాలెంజ్ లు ఆపాలన్న అంబటి
  • 175 సీట్లలో పోటీ చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్
  • బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కు బదులిచ్చే తీరిక లేదన్న నాగబాబు
  • 'రంభల రాంబాబు గారు' అంటూ స్పందించిన బండ్ల గణేశ్

ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలెంజ్ ను అందుకుని చేనేత దుస్తులు ధరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు... కాటన్ దుస్తుల చాలెంజ్ లు ఆపి, 175 సీట్లకి పోటీచేస్తున్నారా? లేదా? అనేది స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా ప్రకటించండి అంటూ డిమాండ్ చేశారు. 

తాజాగా, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. 'బాబూ... ఓ రాంబాబు! ఎన్నిస్లారు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా' అంటూ వ్యాఖ్యానించారు. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసీపీ సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్ కు సమాధానం చెప్పే ఓపిక, తీరిక తమ జనసైనికులకు లేవని, తమ ప్రెసిడెంట్ కు అంతకన్నా లేదని నాగబాబు స్పష్టం చేశారు. 

అటు, అంబటి రాంబాబు వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేశ్ కూడా స్పందించారు. "అలాగే రంభల రాంబాబు గారు... మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారు" అంటూ బదులిచ్చారు.

  • Loading...

More Telugu News