China: భారత్ ఆందోళనల మధ్యే శ్రీలంకకు చేరుకున్న చైనా గూఢచార నౌక.. అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్

Chinese Spy Ship Arrives Sri Lanka Port Amid Concerns In India
  • హంబన్ టోటా పోర్టుకు చేరుకున్న యువాన్ వాంగ్ 5
  • శాటిలైట్లు, బాలిస్టిక్ మిస్సైల్స్ ను ట్రాక్ చేసే సత్తా ఉన్న నౌక
  • ఇండియన్ ఇన్స్టలేషన్స్ ను ట్రాక్ చేసే అవకాశం ఉందని భారత్ ఆందోళన
భారత అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనాకు చెందిన గూఢచార నౌక శ్రీలంకకు చేరుకుంది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న ఈ నౌకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గూఢచార నౌకకు శాటిలైట్లను, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సత్తా ఉండటం గమనార్హం. ఈ బాలిస్టిక్ మిస్సైల్, శాటిలైట్ ట్రాకింగ్ షిప్ పేరు యువాన్ వాంగ్-5. ఉదయం 8.40 గంటలకు ఈ షిప్ శ్రీలంకకు చేరుకుందని హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డీ సిల్వా వెల్లడించారు. 

మరోవైపు... తమ సముద్ర జలాల్లో ఎలాంటి రీసెర్చ్ చేయబోమనే కండిషన్ పై ఈ నౌకను శ్రీలంక అనుమతించిందని పోర్టు అధికారులు తెలిపినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ వెల్లడించింది. ఇంకోవైపు, చైనా గూఢచార నౌక పొరుగున ఉన్న శ్రీలంకకు చేరుకోవడంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇండియన్ ఇన్స్టలేషన్స్ ను ట్రాక్ చేసే అవకాశం ఉందని భారత్ అనుమానిస్తోంది. 

వాస్తవానికి అత్యాధునికమైన ఈ నౌకను తమ దేశానికి తీసుకొచ్చే ఆలోచనను వాయిదా వేసుకోవాలని ఇంతకు ముందు చైనాను శ్రీలంక కోరింది. అయితే, హఠాత్తుగా నిర్ణయాన్ని మార్చుకుని శనివారం నాడు నౌకకు క్లియరెన్స్ ఇచ్చింది. మరోవైపు, చైనా నౌక వచ్చిన నేపథ్యంలో శ్రీలంక విదేశాంగ శాఖ స్పందించింది. భారత్ రక్షణ తమకు అత్యంత ప్రధానమైనదని ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ కోరుకుంటున్న విధంగానే మువాన్ వాంగ్ ను హ్యాండిల్ చేస్తామని చెప్పింది. ఇరు దేశాల సార్వభౌమత్వాలను కాపాడుతామని తెలిపింది.
China
Spy Ship
Sri Lanka
India

More Telugu News