Telangana: ట్రాక్ట‌ర్ ఎక్కి దుక్కి దున్నిన బండి సంజ‌య్‌... ఫొటోలు ఇవిగో

bandi sanjay rides a tractor in his padayatra

  • ప్రజా సంగ్రామ యాత్ర‌లో బండి సంజ‌య్‌
  • న‌ల్ల‌గొండ జిల్లాలో సాగుతున్న సంజ‌య్ యాత్ర‌
  • ట్రాక్ట‌ర్‌తో క‌నిపించిన రైతుల‌తో మాట్లాడిన నేత   

ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో సాగుతున్న బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ శ‌నివారం ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ అవ‌తారం ఎత్తారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర మూడో ద‌శ‌లో భాగంగా ప్ర‌స్తుతం ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న బండి సంజయ్... త‌న దారిలో ఓ పొలం వ‌ద్ద ట్రాక్ట‌ర్‌తో క‌నిపించిన రైతుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ట్రాక్ట‌ర్ ఎక్కి డ్రైవ‌ర్ సీట్లో కూర్చున్న సంజ‌య్‌... ట్రాక్ట‌ర్‌ను న‌డుపుతూ ముందుకు సాగారు.

త‌న‌కు ఓ వైపున రైతును కూర్చోబెట్టుకుని ట్రాక్ట‌ర్‌తో పొలాన్ని దున్నిన సంజ‌య్‌... ఇరగమరగ సాలిరవాలు దున్నాలె.. రైతన్న ఇంట సౌభాగ్యం నిండాలె.. అంటూ వ్యాఖ్యానించారు. ట్రాక్ట‌ర్‌తో పొలం దున్నుతున్న త‌న ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Telangana
BJP
Bandi Sanjay
Nalgonda District
Tractor
  • Loading...

More Telugu News