NCB: కుల ధ్రువీకరణ పత్రం కేసులో ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడేకు క్లీన్ చిట్

Ex NCB officer Sameer Wankhede gets clean chit in certificate case

  • ఆయన పుట్టుకతో ముస్లిం కాదని తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ
  • హిందూ మతం నుంచి ముస్లింకు మారలేదని వెల్లడి
  • సత్యమేవ జయతే అని ట్వీట్ చేసిన వాంఖడే

కుల ధ్రువీకరణ పత్రం కేసులో ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖడేకు క్లీన్ చిట్ లభించింది. వాంఖడే ప్రస్తుత క్యాస్ట్ సర్టిఫికేట్ నిజమైనదని తేలింది. ఆయన హిందువు కాదు ముస్లిం అని వచ్చిన ఫిర్యాదును విచారించిన నిజ నిర్థారణ కమిటీ  91 పేజీల రిపోర్టు అందజేసింది. వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని స్పష్టం చేసింది. సమీర్ వాంఖడే, ఆయన తండ్రి ద్యానేశ్వర్ వాంఖడే హిందూ మతాన్ని త్యజించలేదని, ముస్లిం మతాన్ని స్వీకరించలేదని చెప్పింది. సమీర్ వాంఖడే, ఆయన తండ్రి హిందూ మతంలో గుర్తించిన మహర్-37 షెడ్యూల్డ్ కులానికి చెందినవారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ విషయం వెల్లడైన వెంటనే వాంఖడే స్పందించారు. సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. ‘నా జీవితమంతా నేను సమాజ సేవ కోసం పనిచేశాను. కానీ కొందరు నన్ను ఇబ్బంది పెట్టారు. నాతో పాటు కుటుంబం, చనిపోయిన తల్లిని కూడా విడిచిపెట్టకపోవడం నన్ను బాధపెట్టింది’ అని పేర్కొన్నారు. కాగా, సమీర్‌ వాంఖడే కులం సర్టిఫికెట్‌పై ఫిర్యాదు చేసిన మహారాష్ట్ర కేబినెట్‌ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ తదితదులు తమ వాదనకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయారని నిజ నిర్థారణ కమిటీ తెలిపింది. 

గతేడాది వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ మాలిక్‌ అల్లుడు సమీర్‌ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసింది. మాలిక్‌ క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఈ అరెస్టు జరగడంతో తన కులం విషయాన్ని లేవనెత్తారని వాంఖడే ఆరోపించారు. కాగా, ఇదే కేసులో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను కూడా సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం అరెస్టు చేసింది. దాంతో, వాంఖడే పేరు అప్పట్లో మార్మోగింది.

NCB
Sameer Wankhede
certificate case
clean chit
Shahrukh Khan
drugs case
  • Loading...

More Telugu News