Amir Khan: భారీ ఫ్లాప్ తప్పించుకున్న విజయ్ సేతుపతి

Vijay Sethupathi
  • సౌత్ లో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి
  • 'లాల్ సింగ్ చడ్డా' నుంచి వెళ్లిన ఆఫర్ 
  • డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిన సేతుపతి 
  • ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా  
విజయ్ సేతుపతి .. తమిళనాట ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన బాగా చేరువైపోయాడు. తమిళంలో ఒక వైపున హీరోగా .. మరో వైపున విలన్ గా చేయడం ఆయనకే చెల్లింది. ఆయన ఏ పాత్రను పోషించినా తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపించేలా చేయడం ఆయన ప్రత్యేకత.

అలాంటి విజయ్ సేతుపతితో 'లాల్ సింగ్ చడ్డా' సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయించాలని ఆమిర్ ఖాన్ అనుకున్నాడు. ఆయన కబురు అందుకున్న వెంటనే విజయ్ సేతుపతి వెళ్లి ఆయనను కలిశాడు కూడా. ఆమిర్ ఖాన్ పట్ల అభిమానంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే షూటింగ్ సమయానికి వచ్చేసరికి విజయ్ సేతుపతి డేట్స్ సర్దుబాటు కాలేదు. 

దాంతో ఆయన కోసం అనుకున్న పాత్రకు నాగచైతన్యను తీసుకున్నారు. అయితే మొన్న విడుదలైన ఈ సినిమా తొలి ఆటతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అనేక చోట్ల జనాలు లేక షోలు కేన్సిల్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా ఆడకపోవడం వలన చైతూ కెరియర్ కి వచ్చే నష్టం లేదు. కానీ విజయ్ సేతుపతి ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయ్యేదేననే టాక్ బయట బలంగా వినిపిస్తోంది.
Amir Khan
Nagachaitanya
Vijay Sethupathi

More Telugu News