Yogi Adityanath: సినీ నటుడు శ్రీవాస్తవకు సాయం అందిస్తామన్న యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath spoke to Actor Raju Srivastava wife

  • జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన శ్రీవాస్తవ
  • ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స 
  • శ్రీవాస్తవ భార్యతో మాట్లాడిన సీఎం యోగి

ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఛాతీ నొప్పితో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన జిమ్ ట్రైనర్... ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి ఆయనను హుటాహుటిన తరలించారు. ఆయనకు అన్ని పరీక్షలను నిర్వహించిన వైద్యులు... చివరకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. అది సక్సెస్ అయిందని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

ఆయన కుటుంబసభ్యులు మాట్లాడుతూ, ఆయన ఇంకా అస్వస్థతలోనే ఉన్నారని... అయితే, ఆయన పరిస్థితి చాలా సీరియస్ గా ఉందనే వార్తలను మాత్రం ఎవరూ నమ్మొద్దని చెప్పారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని... డాక్టర్లు ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. 

మరోవైపు శ్రీవాస్తవ కుటుంబానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండగా నిలిచారు. శ్రీవాస్తవ భార్యకు ఫోన్ చేసిన సీఎం... అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. ఇంకోవైపు, శ్రీవాస్తవ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Yogi Adityanath
BJP
Raju Srivastava
Bollywood
  • Loading...

More Telugu News