Venkaiah Naidu: హైద‌రాబాద్ వ‌చ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌... ఘ‌న స్వాగ‌తం ప‌లికిన బీజేపీ నేత‌లు

bjp leaders welcomes venkaiah naidu at shamshabad airport
  • ఈ నెల 10న ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వెంక‌య్య‌
  • మాజీ ఉప‌రాష్ట్రప‌తిగా తొలి సారి హైద‌రాబాద్ రాక‌
  • శంషాబాద్‌లో ఘ‌న స్వాగ‌తం ప‌లికిన కిష‌న్ రెడ్డి, బీజేపీ నేత‌లు
భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ఐదేళ్ల పాటు కొనసాగిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు ఈ నెల 10న‌ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సంగ‌తి తెలిసిందే. ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌ర్వాత రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్న వెంకయ్య శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ వ‌చ్చారు. ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్ర‌యం చేరుకున్న వెంక‌య్య దంప‌తుల‌కు తెలంగాణ బీజేపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత తొలిసారిగా వెంక‌య్య హైద‌రాబాద్ వ‌స్తున్నార‌న్న స‌మాచారం అందుకున్న నేప‌థ్యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి శంషాబాద్ విమానాశ్ర‌యానికి వెళ్లారు. విమానం నుంచి దిగిన వెంక‌య్య‌కు వారంతా ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.
Venkaiah Naidu
BJP
G. Kishan Reddy
Hyderabad
Shamshabad Airport

More Telugu News