Chiranjeevi: సూటు, బూటు, కళ్లకు కూలింగ్ గ్లాసు...చిరంజీవి మెగా లుక్ ఇదిగో!

Chiranjeevi in real mega look
  • వరుస సినిమాలతో మెగా జోరు
  • ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి
  • తాజా ఫొటో షూట్ లో ఆకట్టుకునే స్టిల్స్
  • ఫిట్ అండ్ స్లిమ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్

ఆచార్య చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడు పెంచారు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేశ్ భోళా శంకర్, బాబీతో మరో సినిమా చేస్తున్నారు. అయితే, మునుపెన్నడూ లేనంతగా చిరంజీవి తన లుక్ పై దృష్టి సారించారు. తాజాగా ఆయన స్టిల్స్ చూస్తే ఎంత స్లిమ్ గా ఉన్నారో, ఎంత హార్డ్ వర్క్ చేశారో అర్థమవుతుంది. యంగ్ హీరోలకు దీటుగా డ్యాన్సులు, ఫైట్లలో హుషారు ప్రదర్శించే చిరంజీవి... తాజా ఫిట్ అండ్ స్లిమ్ లుక్ తో ఇంకెంత జోష్ ఫుల్ గా ఉంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

కథల ఎంపికలోనూ విలక్షణ రీతిలో ముందుకు వెళుతున్న చిరు ఆయా పాత్రలకు తగినట్టుగా తనను తాను మలుచుకుంటున్న తీరు వృత్తి పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం. అందుకు తాజా ఫొటోషూట్ లో చిరంజీవి స్టిల్సే నిదర్శనం.

  • Loading...

More Telugu News