Prahlad Joshi: కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

  • ఉచిత విద్యుత్ ఇస్తామని పలు రాష్ట్రాల్లో హామీ ఇస్తున్నారన్న కేంద్ర మంత్రి 
  • ఢిల్లీలో ఏం చేశారో ముందు చెప్పాలని డిమాండ్ 
  • ముందు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో స్టాండర్డ్స్ మెరుగు పరుచుకోండని సలహా 
Prahlad Joshi calls Kejriwal as a lier

ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు అని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలకు సంబంధించి ప్రస్తుతం బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 

ఈ నేపథ్యంలో జోషి మాట్లాడుతూ... ఉచిత విద్యుత్ ఇస్తామంటూ పలు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ హామీలు గుప్పిస్తున్నారని... ఢిల్లీలో ఆయన ఏం చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో స్కూళ్లను అద్భుతంగా తీర్చి దిద్దామని చెప్పుకుంటున్నారని... అలాంటప్పుడు ఆప్ ఎమ్మెల్యేల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చదవడం లేదని ప్రశ్నించారు. ముందు ఢిల్లీ పాఠశాలల్లో స్టాండర్డ్స్ ను మెరుగు పరుచుకోవాలని ఎద్దేవా చేశారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యానికి సంబంధించిన ఉచిత హామీలను కేజ్రీవాల్ మరో స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఉచిత హామీలపై డిబేట్ జరగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. కేజ్రీవాల్ ఇస్తున్న హామీలు ప్రజలను భయపెట్టేలా ఉన్నాయని అన్నారు.

More Telugu News