Delhi: ఢిల్లీ చుట్టూ చెత్తకుప్పలు.. తొలగించేందుకు 197 ఏళ్లు పడుతుందట!

Delhi garbage mountains will take 197 years to clear at current pace

  • పేరుకుపోయిన 27.6 మిలియన్ టన్నుల వ్యర్థాలు
  • మూడేళ్ల కాలంలో తగ్గింది 0.4 మిలియన్ టన్నులే
  • రోజూ కొత్తగా 4,931 టన్నుల వ్యర్థాలు విడుదల

దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల మూడు ప్రాంతాల్లో వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. 27.6 మిలియన్ టన్నుల వ్యర్థాలు అక్కడ ఉన్నాయి. ఈ వ్యర్థాలను తరలించేందుకు రూ.250 కోట్లతో మూడేళ్ల క్రితం ప్రాజెక్టు చేపట్టగా.. ఈ కాలంలో 28 మిలియన్ టన్నుల నుంచి 27.6 మిలియన్ టన్నులకే వ్యర్థాలు తగ్గాయి. అంటే కేవలం 0.4 మిలియన్ టన్నుల వ్యర్థాల తగ్గింపునకు మూడేళ్లు పడితే.. మొత్తం పోవడానికి చాలా సుదీర్ఘకాలం పట్టేట్టు ఉంది. 

గడిచిన మూడేళ్లలో రోజూ సగటున 5,315 టన్నుల వ్యర్థాలను శుభ్రం చేయడం, తొలగించడం చేశారు. అదే సమయంలో ఢిల్లీలో రోజూ కొత్తగా 4,931 టన్నుల వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఇప్పుడున్న ప్రకారం శుద్ధి జరిగితే ఢిల్లీలో పేరుకున్న మొత్తం వ్యర్థాలను తొలగించేందుకు ఎంత లేదన్నా 197 ఏళ్ల సమయం పడుతుందని అంచనా. 

Delhi
garbage
mountains
mosquitos
  • Loading...

More Telugu News