Johnson and Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో కేన్సర్ కారకాలు.. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు నిలిపివేయనున్న సంస్థ

Johnson and Johnson to stop selling talc based baby powder globally in 2023

  • 2023లో నిలిపివేయనున్నట్టు ప్రకటించిన సంస్థ
  • కార్న్ స్టార్చ్ ఆధారిత పౌడర్ ను తీసుకొస్తామని ప్రకటన
  • 2020లోనే అమెరికా, కెనడాలో నిలిచిపోయిన అమ్మకాలు

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ 2023 తర్వాత కనిపించదు. ఈ ఉత్పత్తిని 2023లో నిలిపివేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో కార్న్ స్టార్చ్ తో చేసిన పౌడర్ ను ప్రవేశపెట్టనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ తాను విక్రయించే బేబీ టాల్కమ్ పౌడర్ కారణంగా వినియోగదారుల నుంచి సుమారు 38,000 కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులోని ఆస్బెస్టాస్ ఓవేరియన్ కేన్సర్ కు దారితీస్తున్నట్టు పలువురు మహిళలు కోర్టు మెట్లెక్కారు. 

కానీ, దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన స్వతంత్ర దర్యాప్తులో తమ ఉత్పత్తి సురక్షితమేనని వైద్య నిపుణులు తేల్చినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పోర్ట్ ఫోలియోను మదించిన అనంతరం, బేబీ పౌడర్ ఉత్పత్తుల తయారీకి కార్న్ స్టార్చ్ కు మళ్లాలని నిర్ణయించినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కార్న్ స్టార్చ్ పౌడర్ ను విక్రయిస్తున్నట్టు పేర్కొంది. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ ను 2020లోనే అమెరికా, కెనడాలో నిలిపివేసింది. 

Johnson and Johnson
baby talk powder
discontinued
cornstarch based powder released
  • Loading...

More Telugu News