Balakrishna: బాలకృష్ణ 108వ సినిమా ప్రకటన వచ్చేసింది!

Balakrishna in Anil Ravipudi movie

  • షూటింగు దశలో బాలకృష్ణ 107వ సినిమా 
  • 108వ సినిమాకి సన్నాహాలు 
  • దర్శకుడిగా అనిల్ రావిపూడి 
  • సంగీత దర్శకుడిగా తమన్  

బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బాలకృష్ణ తన 108వ సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్న విషయం కొంతకాలం క్రితమే బయటికి వచ్చింది. 
 
ఆయా ఇంటర్వ్యూలలో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టును గురించి బాలకృష్ణ కూడా ధ్రువపరచడం జరిగింది. తాజాగా ఈ సినిమా పైకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వీడియోను వదిలారు. పవర్ఫుల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రూపొందనున్న విషయాన్ని ఈ వీడియో ద్వారా చెప్పేశారు. 

సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ కథ తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరుగుతుందనీ, కూతురు పాత్రలో శ్రీలీల చేయనుందనే  విషయాన్ని ఇంతకుముందే అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య సరసన ఎవరు కథానాయికగా చేయనున్నారనే విషయంలోనే క్లారిటీ రావలసి ఉంది. 

Balakrishna
Sreeleela
108 Movie
Anil Ravipudi
  • Loading...

More Telugu News