Balakrishna: ఆ సినిమాలో చెల్లెలి పాత్ర చేయమంటే లయ ఏడ్చేసింది: దర్శకుడు వినాయక్

Chennakeshava Reddy Movie

  • బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల్లో 'చెన్నకేశవరెడ్డి' ఒకటి
  • వినాయక్ నుంచి వచ్చిన మరో మాస్ యాక్షన్ మూవీ
  • వయసు మళ్లిన పాత్రను చేయడానికి సౌందర్య నో చెప్పిందన్న వినాయక్ 
  •  అందుకే చెల్లి పాత్ర కోసం దేవయానిని తీసుకున్నామని వెల్లడి 

బాలకృష్ణ కథానాయకుడిగా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'చెన్నకేశవరెడ్డి' 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన టబు .. ఆయన చెల్లెలి పాత్రలో దేవయాని నటించారు. బెల్లంకొండ సురేశ్ నిర్మించిన ఈ సినిమాను గురించి 'తెరవెనుక కథలు' కార్యక్రమంలో వినాయక్ ప్రస్తావించాడు. 

"ఈ సినిమాలో కథానాయికగా సౌందర్య అయితే బాగుంటుందని అనుకుని ఆమెకి కథను వినిపించాను. కథ విన్న తరువాత తాను ఈ ప్రాజెక్టు చేయలేనని చెప్పారు. ఈ సినిమా చివరలో హీరోయిన్ కాస్త వయసుమళ్లిన లుక్ తో కనిపించవలసి ఉంటుంది. అలా కనిపించలేనంటూ ఆమె తిరస్కరించడం జరిగింది" అని అన్నాడు. 

ఇక ఇదే సినిమాలో బాలయ్య చెల్లెలి పాత్రకి 'లయ' అయితే బాగుంటుందని భావించి, ఆమెకి కథ చెప్పాను. 'నేను హీరోయిన్ గా చేస్తుంటే .. చెల్లెలి పాత్ర కోసం అడగడం కరెక్టేనా?' అంటూ లయ ఏడ్చేసింది. దాంతో ఆ పాత్రకోసం దేవయానిని తీసుకున్నాం. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు  తెచ్చిపెట్టింది" అని వినాయక్ చెప్పుకొచ్చాడు.

Balakrishna
Vinayak
Chennakeshva Reddy Movie
  • Loading...

More Telugu News