Jagan: సీఎం జగన్ కు రాఖీ కట్టిన మహిళా నేతలు.. వీడియో ఇదిగో!

Women leaders tie rakhis to Jagan

  • రాఖీ పండుగ సందర్భంగా సీఎంతో ఆత్మీయతను పంచుకున్న మహిళా నేతలు
  • రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన జగన్
  • అక్కచెల్లెమ్మలకు దేవుడి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన సీఎం

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రికి వైసీపీ మహిళా నేతలు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. రాఖీలు కట్టిన వారిలో మంత్రులు విడదల రజని, తానేటి వనిత, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. బ్రహ్మకుమారీలు కూడా రాఖీలు కట్టారు.

మరోవైపు ముఖ్యమంత్రి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ ఆత్మీయత, అనురాగాల పండుగ అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికీ దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

మరోవైపు బాపట్లలో జరుగుతున్న జగనన్న విద్యాదీవెన పథకం కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కోన రఘుపతి, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలిజేస్తున్నానని చెపుతూ సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

Jagan
YSRCP
Rakhi
Women Leaders
  • Loading...

More Telugu News