Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి భారీగా నీరు... నాగార్జునసాగర్ లో 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

Water released from Nagarjuna Sagar project

  • కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • శ్రీశైలంకు భారీగా వరద నీరు
  • గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
  • నాగార్జున సాగర్ కు పెరిగిన ఇన్ ఫ్లో

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అక్కడ 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో నాగార్జునసాగర్ జలాశయం వద్ద కూడా 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 

ప్రస్తుతం నాగార్జునసాగర్ కు 4.72 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 1.17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 586 అడుగుల మేర నీరు ఉంది.

Nagarjuna Sagar
Water
Release
Rains
Krishna River
  • Loading...

More Telugu News