TDP: నంద్యాలలో హ‌త్య‌కు గురైన కానిస్టేబుల్ కుటుంబానికి టీడీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

tdp leaders consoles murdered police constable family in nandyal

  • 2 రోజుల క్రితం హ‌త్య‌కు గురైన కానిస్టేబుల్ సురేంద్ర
  • ప‌ట్ట‌ణంలోనే దాడి చేసి హ‌త్య చేసిన రౌడీ మూక‌లు
  • రాష్ట్రంలో సామాన్యుల మాన‌, ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేద‌న్న టీడీపీ నేత‌లు

ఏపీలోని నంద్యాల‌లో రెండు రోజుల క్రితం పోలీస్ కానిస్టేబుల్ సురేంద్రను రౌడీ మూక‌లు దారుణంగా హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాధిత కుటుంబ స‌భ్యుల‌ను టీడీపీ నేత‌లు బుధ‌వారం ప‌రామ‌ర్శించారు. టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్, మ‌రో మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మనంద‌రెడ్డిలు బుధ‌వారం బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. 

ఈ సంద‌ర్భంగా వారు రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ హ‌యాంలో పోలీసుల ప్రాణాల‌కే భ‌ద్ర‌త లేకుండా పోయింద‌న్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో ఉన్న పోలీసుల‌కే భ‌ద్ర‌త లేక‌పోతే రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో సామాన్యుల మాన, ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని వారు ఆరోపించారు.

TDP
Nandyal
Andhra Pradesh
Bhuma Akhila Priya
Bhuma Bramhananda Reddy
NMD Farooq
  • Loading...

More Telugu News