Google: గూగుల్ డేటా సెంటర్ లో ప్రమాదం.. సెర్చింజన్ కు కొన్ని నిమిషాల అవాంతరం

Fire in Google data centre brings Google Search down for minutes

  • లోవాలోని డేటా సెంటర్ లో అగ్ని ప్రమాదం
  • ముగ్గురు ఉద్యోగులకు కాలిన గాయాలు
  • సెర్చింజన్ లో కొంత సమయం పాటు నిలిచిన సేవలు
  • పరిష్కరించిన గూగుల్ ఇంజనీర్లు

గూగుల్ కు చెందిన అమెరికాలోని ఓ డేటా కేంద్రంలో అగ్ని ప్రమాదం కారణంగా సెర్చింజన్ సేవలకు కొంత సమయం పాటు ఈ ఉదయం అవాంతరం ఏర్పడింది. ఈ విషయాన్ని గూగుల్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. లోవాలోని కౌన్సిల్ బ్లఫ్ లో ఉన్న గూగుల్ డేటా సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగినట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం తమకు ప్రథమ ప్రాధాన్యమని గూగుల్ ప్రతినిధి తెలిపారు. వారికి కావాల్సిన సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రమాదం కారణంగా మంగళవారం ఉదయం యూజర్లకు సెర్చింజన్ లో సమస్యలు ఎదురయ్యాయి. సెర్చింజన్ పనిచేయడం లేదంటూ సుమారు 40 వేల మందికి పైగా ఫిర్యాదులు చేశారు. ‘502 ఎర్రర్’ కనిపిస్తూ.. 30 సెకన్ల తర్వాత ప్రయత్నించండంటూ వారికి సందేశం కనిపించింది. సర్వర్ లో ఏర్పడిన ఈ సమస్యను గూగుల్ ఇంజనీర్లు పరిష్కరించారు.

Google
Search
down
data centre
fire
users
complined
  • Loading...

More Telugu News