Kolkata: మహిళా ప్రొఫెసర్ అభ్యంతరకర ఫొటోలు.. విద్యార్థి తండ్రి ఫిర్యాదు

Kolkata college forces professor to quit over complaint of student looking at her bikini pics

  • కోల్ కతాలోని సెయింట్ జేవియర్ వర్సిటీలో ఘటన
  • మహిళా ప్రొఫెసర్ అశ్లీల ఫొటోలను చూస్తూ దొరికిపోయిన డిగ్రీ విద్యార్థి
  • గమనించిన తండ్రి నేరుగా వర్సిటీకి ఫిర్యాదు

ఓ డిగ్రీ విద్యార్థి ఏకంగా తన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్ధ నగ్న ఫొటోలను చూస్తుండగా.. అతడి తండ్రి కంట్లో పడింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఆ తండ్రి యూనివర్సిటీకి ఫిర్యాదు చేయడంతో మహిళా ప్రొఫెసర్ ఊద్యోగం ఊడిపోయింది. కోల్ తాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న ఫొటోలను ఆసక్తిగా చూస్తున్నాడు. బికినీల్లో, కేవలం ఇన్నర్ వేర్లు ధరించిన ఓ మహిళ ఫొటోలు అవి. ఆ విద్యార్థి తండ్రి చాటుగా పరిశీలించి చూడగా, అవి మహిళా ఫ్రొఫెసర్ అని గుర్తించాడు. మహిళా ప్రొఫెసర్ అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, అశ్లీలంగా ఉన్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కనిపించడం పట్ల ఆ తండ్రి సీరియస్ అయ్యాడు. మహిళా ప్రొఫెసర్ పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో తన శరీరాన్ని ప్రదర్శించడం అభ్యంతరకరమంటూ యూనివర్సిటీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

దీంతో గతేడాది అక్టోబర్ 7న భేటీ అయిన యూనివర్సిటీ పాలకమండలి మహిళా ప్రొఫెసర్ కు ఫిర్యాదులు, ఫొటోల ప్రతులను చూపించింది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం కోల్పోయింది. ఈ క్రమంలో తనను వర్సిటీ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె ఆరోపిస్తుండగా, స్వచ్చందంగా రాజీనామా చేసినట్టు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. దీనిపై మహిళా ప్రొఫెసర్ ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా హ్యాక్ కు గురైందని, అక్కడి నుంచి పొటోలు లీక్ అయి, షేర్ అయినట్టు ఫిర్యాదు చేశారు.

Kolkata
professor
bikini pics
student
parent
compliant
  • Loading...

More Telugu News