India: కామన్వెల్త్ క్రీడల్లో రజతంతో సరిపెట్టుకున్న భారత హాకీ జట్టు... ఆసీస్ తో ఫైనల్లో ఘోర పరాజయం

India settled for silver as Australia claims gold in Commonwealth games

  • భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హాకీ ఫైనల్
  • 0-7తో ఓడిన భారత జట్టు
  • ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయిన భారత్
  • కామన్వెల్త్ హాకీ చరిత్రలో ఆసీస్ కు ఏడో స్వర్ణం

భారత పురుషుల హాకీ జట్టు కామన్వెల్త్ క్రీడల్లో నిరాశపరిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన పురుషుల హాకీ ఫైనల్స్ లో 0-7తో ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేక ఉసూరుమనిపించింది. భారత్ రజతంతో సరిపెట్టుకోగా, గోల్స్ వర్షం కురిపించిన ఆస్ట్రేలియా స్వర్ణం ఎగరేసుకెళ్లింది. కామన్వెల్త్ హాకీలో ఆసీస్ కు ఇది 7వ స్వర్ణం. 

నేటి మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు పక్కా ప్రణాళికతో ఆడారు. బంతిని ఎక్కువగా తమ అధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. భారత్ కు ఒకటీ అరా అవకాశాలు లభించినా, ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరవడడంతో ఒక్క గోల్ కూడా లభించలేదు. 

కాగా, కామన్వెల్త్ క్రీడలకు నేడు ఆఖరిరోజు. ఇవాళ హాకీలో తప్పిస్తే బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ లో భారత్ కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి.

India
Silver
Hockey
Australia
Gold
Commonwealth Games
  • Loading...

More Telugu News