Kurnool District: జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న రైతుకు దొరికిన వజ్రం.. రూ. 25 లక్షలకు వ్యాపారి కొనుగోలు

Jonnagiri farmer found diamond which costs Rs 25 lakhs

  • రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన రైతు
  • బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ. 40 లక్షలకు పైమాటే
  • జొన్నగిరి భూమిలో విలువైన వజ్రాలు

వర్షాకాలం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి కళకళలాడిపోతూ ఉంటుంది. వర్షాకాలంలో జొన్నగిరి రైతుల్లో ఒకరిద్దరైనా రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఆ మట్టిలో విలువైన వజ్రాలు దాగి ఉండడమే అందుకు కారణం. వర్షం కారణంగా మట్టి కొట్టుకుపోయి వజ్రాలు బయటపడుతూ ఉంటాయి. అందుకనే ఒక్క జొన్నగిరి వాసులు మాత్రమే కాదు.. చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుంచి కూడా వచ్చి జొన్నగిరిలో వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. 

తాజాగా, పొలంలో పనిచేసుకుంటున్న జొన్నగిరి రైతుకు దొరికిన వజ్రం అతడిని లక్షాధికారిగా మార్చింది. నిన్న ఉదయం పొలంపని చేసుకుంటున్న రైతు చేతికి ఓ వజ్రం చిక్కింది. విషయం తెలిసిన ఓ వ్యాపారి దానిని రూ. 25 లక్షలకు సొంతం చేసుకున్నాడు. బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ. 40 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Kurnool District
Jonnagiri
Diamond
  • Loading...

More Telugu News