Kalyanram: ఒక చిన్న మెసేజ్ తో ఇంత పెద్ద ఛాన్స్ వస్తుందనుకోలేదు: 'బింబిసార' డైరెక్టర్

Bimbisara movie update

  • 'బింబిసార' డైరెక్టర్ గా వశిష్ఠ 
  • ప్రమోషన్స్ లో తను బిజీ బిజీ
  • ముందుగా రెండు కథలు వినిపిస్తే కల్యాణ్ రామ్ నో చెప్పాడట
  • 'బింబిసార' కథ వినగానే ఓకే చెప్పాడన్న దర్శకుడు 

కల్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార' సినిమా రూపొందింది. తన సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఆయన నిర్మించిన ఈ సినిమాకి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. సంయుక్త మీనన్ .. కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
 
తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ .. "దర్శకుడిగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో కొన్ని కథలను రెడీ చేసుకున్నాను. రవితేజ .. అల్లు శిరీష్ లకు కథలను వినిపించాను .. కానీ వర్కౌట్ కాలేదు. ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా కల్యాణ్ రామ్ గారు గుర్తొచ్చారు. 'పటాస్' నుంచి నాకు కల్యాణ్ రామ్ గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. 

కల్యాణ్ రామ్ గారిని కలుసుకుని రెండు కథలు వినిపించాను .. అవి ఆయనకి నచ్చలేదు. దాంతో 'బింబిసార' కథను రెడీ చేసుకుని .. మళ్లీ ఆయనను కలవాలనుకుంటున్నట్టుగా మెసేజ్ పెట్టాను. ఆయన రమ్మనగానే వెళ్లి కలిశాను .. కథ వినగానే ఆయన ఓకే చెప్పేశారు. ఒక చిన్న మెసేజ్ ఇంతపెద్ద అవకాశాన్ని తెచ్చిపెడుతుందని నేను ఎంతమాత్రం ఊహించలేదు" అంటూ చెప్పుకొచ్చాడు.

Kalyanram
Samyuktha Menon
Bimbisara Movie
  • Loading...

More Telugu News