TDP: అమెరికాలోని వెంక‌న్న ఆల‌యం వ‌ద్ద భార్య‌తో క‌లిసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫొటో

tdp mla gorantla posts a photo with his wife at new jersey venkateswara swamy temple

  • అమెరికా ప‌ర్య‌ట‌న‌లో గోరంట్ల‌
  • న్యూజెర్సీలోని వెంక‌న్న ఆల‌యాన్ని సంద‌ర్శించిన వైనం
  • భార్య‌తో క‌లిసి ఆల‌యం వ‌ద్ద దిగిన ఫొటోను పంచుకున్న టీడీపీ ఎమ్మెల్యే

టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. చాలా రోజుల క్రిత‌మే స‌తీ స‌మేతంగా గోరంట్ల అమెరికా వెళ్లారు. ఈ క్ర‌మంలో అమెరికాలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న ఆయా ప్రాంతాల సంద‌ర్శ‌న సంద‌ర్భంగా త‌న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ వ‌స్తున్నారు.

తాజాగా న్యూజెర్సీలో ఉన్న గోరంట్ల త‌న భార్య‌తో క‌లిసి శ్రీవేంక‌టేశ్వర స్వామి ఆల‌యానికి వెళ్లారు. ఆల‌య గోపురం క‌నిపించేలా ఆల‌యానికి స‌మీపంలో ఉన్న ఓ బ్రిడ్జిపైకి చేరిన ఆయ‌న త‌న అర్ధాంగితో క‌లిసి ఫొటో దిగారు. ఈ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పంచుకున్న ఆయ‌న‌... వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

TDP
Gorantla Butchaiah Chowdary
America
New Jersey
USA
venkateswara swamy temple
  • Loading...

More Telugu News