Kalyanram: బాలయ్య చీఫ్ గెస్టుగా 'బింబిసార' మరో ఈవెంట్!

Bimbisara movie update

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
  • ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా మొన్ననే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల  

కల్యాణ్ రామ్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో 'బింబిసార' నిర్మితమైంది. కల్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. గతంలో 'ప్రేమలేఖ రాశా .. ' సినిమాలో అంజలి సరసన హీరోగా నటించిన వశిష్ఠ ఈ సినిమాకి దర్శకుడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. కల్యాణ్ రామ్ తప్ప ఈ పాత్రను ఇంత గొప్పగా పోషించడం ఎవరివల్లా కాదని కితాబునిస్తూ, సినిమాపై అంచనాలు పెంచేలా ఎన్టీఆర్ మాట్లాడాడు. ఇక ఇప్పుడు బాలయ్య చీఫ్ గెస్టుగా కల్యాణ్ రామ్ మరో ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. 

కల్యాణ్ రామ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఇంటర్వ్యూలోను బాలకృష్ణ ప్రస్తావనను తెస్తూ వచ్చాడు. సినిమాల్లోకి తన ఎంట్రీ ఆయన వల్లనే జరిగిందనీ .. ఆయన ప్రభావం తన కెరియర్ పై ఉందని చెప్పాడు. ఆయనతో ఉన్న అనుబంధం కారణంగానే బాలయ్య ముఖ్య అతిథిగా మరో ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.

Kalyanram
Samyuktha Menon
Catherine
Bimbisara Movie
  • Loading...

More Telugu News