Sprite: స్ప్రయిట్​ కూల్ డ్రింక్ బాటిల్ రంగు మారుతోంది.. 60 ఏళ్ల తర్వాత గ్రీన్​ ను వదిలేస్తోంది..!

Sprite is retiring its iconic green bottle after over 60 years

  • దాదాపు 60 ఏళ్లుగా ఆకుపచ్చ బాటిళ్లలోనే స్ప్రయిట్ కూల్ డ్రింక్
  • ఇక ముందు ట్రాన్స్ పరెంట్ బాటిళ్లలో సరఫరా.. ప్రస్తుతానికి అమెరికాలో అమలు
  • త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు చేస్తామన్న కోకకోలా సంస్థ
  • ప్లాస్టిక్ రీసైక్లింగ్ సులువు కావడం కోసమే ఈ నిర్ణయమని వెల్లడి

ఇంట్లో ఉన్నా.. ఎక్కడైనా బయటికి వెళ్లినా కూల్ డ్రింక్స్ తాగడం చాలా మందికి అలవాటే. అందులోనూ మన ప్రాంతాల్లో అయితే థమ్సప్ లేదంటే స్ప్రయిట్ అన్నట్టుగా ఉంటుంది డిమాండ్. పాన్ షాపులు మొదలుకుని భారీ మాల్స్ వరకు కూల్ డ్రింక్స్ ను వరుసగా పేర్చి పెట్టడం, వాటి వైపు చూడగానే ఏది ఏమిటనేది టక్కున గుర్తు పట్టడం కూడా మామూలే. 

కాస్త ఆకుపచ్చ రంగు బాటిల్ లో ఉండే స్ప్రయిట్ ను చాలా ఈజీగా గుర్తుపట్టేస్తుంటాం. ఏకంగా గత 60 ఏళ్లుగా స్ప్రయిట్ అదే ఆకుపచ్చ రంగు బాటిళ్లలో వస్తోంది మరి. ఇన్నేళ్లలో బాటిళ్ల ఆకారం మారినా.. స్ప్రయిట్ ఉండే ఆకుపచ్చ రంగు మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు ఆ ఆకుపచ్చ రంగుకు స్ప్రయిట్ గుడ్ బై చెప్పేస్తోంది. స్ప్రయిట్ బ్రాండ్ ను ప్రమోట్ చేసే కోకకోలా కంపెనీ ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది.

  • ఇక ముందు దీని బాటిల్ సాధారణ పారదర్శక ప్లాస్టిక్ బాటిళ్లలో రానుంది. అసలే నీళ్లలా ట్రాన్స్ పరెంట్ గా ఉండే ఈ కూల్ డ్రింక్ ఇప్పుడు చూడటానికి సోడా బాటిళ్లలా కనిపించనుంది.
  • అయితే దీని బాటిల్ రంగును తొలగించినా.. దాని లోగో, మూత మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉండనున్నాయి. లోగోను మాత్రం కాస్తంత మార్చారు.
  • పునర్వినియోగానికి (రీసైక్లింగ్) వీలుగా ఉండేలా రంగుల్లేని ప్లాస్టిక్ ను ఉపయోగించాలని నిర్ణయించడమే.. స్ప్రయిట్ బాటిల్ రంగును మార్చడానికి కారణమని కోకకోలా సంస్థ ప్రకటించింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
  • ప్రస్తుతానికి అమెరికాలో స్ప్రయిట్ కలర్ ను మార్చినట్టు ప్రకటించిన కోకకోలా సంస్థ.. తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అమలు చేస్తామని తెలిపింది.

Sprite
Cool drink
Coca cola
USA
India
Business
Plastic
Environment
Plastic Recycling
Offbeat
  • Loading...

More Telugu News