Ajith: తమిళనాడు రాష్ట్ర షూటింగ్ పోటీల్లో హీరో అజిత్ కు 4 స్వర్ణ పతకాలు

Hero Ajith wins four gold medals in Tamilnadu State Shooting Championship

  • షూటింగ్ పోటీల్లో అజిత్ ప్రావీణ్యం
  • తిరుచ్చిలో 47వ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీలు
  • తన జట్టుతో కలిసి పాల్గొన్న అజిత్

దక్షిణాది స్టార్ హీరో అజిత్ సినిమాల్లోనే కాదు, బయట కూడా డైనమిక్ గానే ఉంటారు. ఆయన ప్రతిభావంతుడైన బైక్ రేసర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన షూటింగ్ పోటీల్లోనూ తన ప్రావీణ్యం ప్రదర్శించారు. ఏదో అందరిలా ప్రాతినిధ్యం వహించడం కాదు, ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు.

ప్రస్తుతం తిరుచ్చిలో 47వ రాష్ట్రస్థాయి షూటింగ్ చాంపియన్ షిప్ జరుగుతోంది. ఇందులో అజిత్ టీమ్ కూడా పాల్గొంది. ఇందులో సీఎఫ్ పీ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్, 50 మీటర్ల ఎఫ్ పీ మాస్టర్ విభాగాల్లో అజిత్ అద్భుత ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో మరో రెండు కాంస్యాలు కూడా అజిత్ వశమయ్యాయి. అజిత్ గతేడాది చెన్నైలోనూ షూటింగ్ పోటీల్లో సత్తా చాటాడు. ఏకంగా 6 పసిడి పతకాలు అందుకున్నాడు.

Ajith
Gold
Shooting
Tamil Nadu
Kollywood
  • Loading...

More Telugu News