UAE: యూఏఈలో వర్ష బీభత్సం.. ఆకస్మిక వరదలతో అతలాకుతలం: వీడియో ఇదిగో

UAE hit by worst floods in 27 years Viral Videos Show UAE Flooded

  • ఫుజైరాలో రెండు రోజుల్లో కురిసిన వర్షంలో 27 ఏళ్ల రికార్డు బద్దలు
  • 4 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు
  • జనజీవనం అస్తవ్యస్తం.. నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

అకాల వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అతలాకుతలమైంది. గత 27 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. ఫలితంగా వాహనాలు నీటమునిగాయి. వందలాదిమంది వరదల్లో చిక్కుకున్నారు. 

రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు, సైన్యం సహాయ కార్యక్రమాలు చేపట్టి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 4 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా రాతి ఎడారి ప్రాంతంగా పేరుపొందిన ఫుజైరా (Fujairah), షార్జాల్లో కురిసిన భారీ వర్షమే వరదలకు కారణమైనట్టు అధికారులు తెలిపారు. ఫుజైరాలో రెండు రోజులపాటు కురిసిన వర్షంతో 27 ఏళ్లనాటి అత్యధిక వర్షపాతం రికార్డు బద్దలైనట్టు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. 

ఇక్కడ గత రెండు రోజుల్లో ఏకంగా 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాని సమీపంలోని మసాఫీ గ్రామంలో 20.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఫుజైరా విమానాశ్రయం సమీపంలో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల దిగువన ఉన్న గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. యూఏఈలో వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

  • Loading...

More Telugu News