Kalyanram: స్పీడ్ పెంచుతున్న సంయుక్త మీనన్!

  • మలయాళం నుంచి వచ్చిన మరో భామగా సంయుక్త  
  • 'భీమ్లా నాయక్'తో తెలుగు తెరకి పరిచయం
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'బింబిసార'
  • ద్విభాషా చిత్రంగా రానున్న 'సార్'  
Bimbisara movie update

తెలుగు తెరపై మలయాళ భామల జోరు కొనసాగుతోంది. మలయాళం నుంచి ఇక్కడికి వచ్చిన ముద్దుగుమ్మలు ఎక్కువే .. నిలదొక్కుకున్నవారూ ఎక్కువే. అలా ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి వచ్చిన కథానాయికగా సంయుక్త మీనన్ కనిపిస్తుంది. 2016లోనే ఈ సుందరి మలయాళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

అందాల కథానాయికగా అక్కడ మంచి మార్కులు కొట్టేసిన సంయుక్త మీనన్, ఆ తరువాత కోలీవుడ్ లోను కుదురుకునే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ముందుగా ఆమె ఒప్పుకున్న సినిమా 'బింబిసార'నే. భారీతనం కారణంగా ఈ సినిమా ఆలస్యం కావడం వలన, ముందుగా 'భీమ్లా నాయక్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాల కారణంగా ఆ సినిమా క్రెడిట్ ఆమె ఖాతాలో చేరలేదు. 

ఇక ఇప్పుడు కల్యాణ్ రామ్ జోడీగా చేసిన 'బింబిసార' ఆగస్టు 5వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ఉండటం వలన ఆమె గట్టి ఆశలే పెట్టుకుంది. ఇక ధనుశ్ సరసన చేసిన 'సార్' కూడా త్వరలో తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ బ్యూటీ లైన్లో పెడుతున్న ప్రాజెక్టులు చూస్తుంటే స్పీడ్ పెంచినట్టుగానే కనిపిస్తోంది.

More Telugu News