Balakrishna: బాలయ్య సరసన నాయికగా సోనాక్షి సిన్హా!

Balakrishna in Anil Ravipudi movie
  • బాలీవుడ్ భామగా సోనాక్షి 
  • 'లింగా' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ 
  • బాలయ్య సినిమా కోసం సంప్రదింపులు
  • ఓకే చెప్పేసిందంటూ టాక్  

బాలీవుడ్ లోని భారీ అందాల భామల్లో సోనాక్షి సిన్హా ఒకరు. బలమైన సినిమా నేపథ్యాన్ని కలిగిన కుటుంబం నుంచి వచ్చిన సోనాక్షి, తన టాలెంట్ తోనే నిలబడటానికి ప్రయత్నిస్తూ వచ్చింది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అప్పుడే పుష్కరకాలమవుతోంది. ఈ పన్నెండు ఏళ్లలో ఆమె హిందీ సినిమాలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. 

తమిళంలో రజనీకాంత్ సరసన నాయికగా సోనాక్షి 'లింగా' సినిమా చేసింది. ఆ సినిమాలో గిరిజన యువతిగా ఆమె పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఆ తరువాత ఆమె తెలుగు సినిమాలో కూడా చేస్తుందని అనుకున్నారుగానీ, ఇంతవరకూ చేయలేదు. తాజాగా బాలయ్య సరసన ఆమె చేయనుందనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం బాలయ్య .. గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయనున్నాడు.  ఇది తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందని అనిల్ చెప్పాడు. కూతురు పాత్రలో శ్రీలీలను తీసుకోవడం జరిగిపోయిందని అన్నాడు. ఈ సినిమా కోసమే సోనాక్షి ఎంపిక జరిగిందని అంటున్నారు.

  • Loading...

More Telugu News