Starlink: నేరుగా మొబైల్​ ఫోన్లకు శాటిలైట్​ ఇంటర్నెట్​.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఫుల్​ సిగ్నల్​, ఫుల్​ స్పీడ్​.. స్టార్​ లింక్​ సంస్థ ఏర్పాట్లు!

Spacex starlink mobile broadband in future soon in US

  • శాటిలైట్లలో ప్రత్యేక పరికరాలు అమర్చి ప్రయోగించేందుకు అనుమతికి దరఖాస్తు
  • అమెరికాలో తొలుత అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైన స్టార్ లింక్
  • అందరికీ మంచి కనెక్టివిటీ అందుబాటులో ఉంటుందని వెల్లడి

రోజూ ఏదో ఓ పని మీద బయటికి వెళ్తుంటాం. ఫోన్ మాట్లాడాలి లేదా ఇంటర్నెట్ లో ఏదో పని ఉంది. కానీ ఒక్కో చోట సిగ్నల్ సరిగా ఉండదు. సిగ్నల్ ఉన్నా ఇంటర్నెట్ సరిగా రాదు. ఇక పట్టణాలకు అవతల, గ్రామీణ ప్రాంతాల్లో అయితే సిగ్నల్ లేకపోవడం, ఇంటర్నెట్ రాకపోవడం ఎప్పుడూ ఉండే సమస్యే. అయితే ఇక్కడ, అక్కడ అని లేకుండా అన్నిచోట్లా ఫుల్ సిగ్నల్, ఫుల్ స్పీడ్ తో ఇంటర్నెట్ వస్తే భలేగా ఉంటుంది కదా. ఆ దిశగా నేరుగా మొబైల్ ఫోన్లకు శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

ప్రత్యేక పరికరాలు ప్రయోగించేందుకు..
స్టార్ లింక్ సంస్థ ఇప్పటికే 2,600కుపైగా శాటిలైట్ల సాయంతో ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. తాజాగా మొబైల్ శాటిలైట్ సర్వీసులు అందించడం కోసం అమెరికా ‘ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్ సీసీ)’కు తాజాగా దరఖాస్తు చేసింది. 2 గిగాహెడ్జ్ స్పెక్ట్రం వినియోగానికి సంబంధించిన ప్రత్యేక పరికరాలను తమ శాటిలైట్లకు అనుసంధానించేందుకు అనుమతించాలని కోరింది. ఇది మొబైల్ ఫోన్లకు నేరుగా ఇంటర్నెట్ అందించేందుకు వీలు కల్పిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 

ఎక్కడైనా, ఎప్పుడైనా కనెక్టివిటీ కోసం..
ఎఫ్ సీసీ అనుమతికి దరఖాస్తు చేసుకున్న స్టార్ లింక్ కంపెనీ అందులో తమ ప్రతిపాదనకు కారణాలను పేర్కొంది. ‘‘అమెరికన్లు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏం చేస్తున్నా సరే.. తమకు మంచి కనెక్టివిటీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. చేతిలో పట్టుకుని, ఎక్కడికైనా తీసుకోగల చిన్న పరికరాలతోనే మంచి కనెక్టివిటీ ఉండాలని ఆశిస్తున్నారు...” అని పేర్కొంది. ఈ మొబైల్ ఇంటర్నెట్ కోసం ఇప్పటికే ఉన్న గ్రౌండ్ స్టేషన్లు, ఇతర వ్యవస్థలను ఉపయోగించుకుంటామని వెల్లడించింది.

Starlink
SpaceX
Satellite Internet Service
Broadband
USA
Internet
Satellite
Tech-News
Science
Offbeat
  • Loading...

More Telugu News