Margani Bharat: తండ్రితో కలిసి ఏపీ సీఎం జ‌గ‌న్‌కు స్వాగతం చెప్పిన ఎంపీ మార్గాని భ‌ర‌త్

  • వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన సీఎం 
  • రాత్రికి రాజమహేంద్రవరంలో బస 
  • ఫొటోలు పోస్ట్ చేసిన ఎంపీ భరత్  
ysrcp mp margani bharat father margani nageswara rao met ys jagan in rajamahendravaram

వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న కోసం ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ వైసీపీ యువ నేత మార్గాని భ‌ర‌త్ రామ్, ఆయన తండ్రి మార్గాని నాగేశ్వ‌ర‌రావు కలిశారు. మంగ‌ళ‌వారం కోన‌సీమ జిల్లాలో ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని రాత్రికి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చేరుకున్న జ‌గ‌న్‌... రాత్రికి అక్క‌డే బ‌స చేసిన సంగ‌తి తెలిసిందే. మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో తన కుమారుడు మార్గాని భరత్ తో కలిసి సీఎం జగన్ కు మార్గాని నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎంపీ భరత్ సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

More Telugu News