Ayyanna Patrudu: సజ్జలకు ఏం నాలెడ్జ్ ఉంది?: అయ్యన్నపాత్రుడు

  • సజ్జల కూడా ఒక సలహాదారుడేనా? అన్న అయ్యన్న 
  • వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆరోపణ 
  • నోటీసు కూాడా ఇవ్వకుండానే నా ఇంటి గోడ పగులగొట్టించారని విమర్శ 
Ayyanna Patrudu satires on Sajjala

ఏపీ ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. సజ్జలకు ఏం నాలెడ్జ్ ఉందని ఆయన ప్రశ్నించారు. ఆయన కూడా ఒక సలహాదారుడేనా? అని ఎద్దేవా చేశారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు. 

అధికారులు దగ్గరుండి తన ఇంటి గోడను పగులగొట్టించారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండానే గోడ పగులగొట్టారని అన్నారు. టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దొంగోడు చెపితే... పోలీసులు తమను దొంగలను చేస్తున్నారని పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చెత్త మద్యాన్ని అమ్ముతున్నారని... మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

More Telugu News