Ajith Kumar: ‘రైఫిల్ షూటింగ్’ లో సత్తా చాటనున్న తమిళ హీరో అజిత్ కుమార్

Ajith Kumar takes part in 47th Tamil Nadu Rifle Shooting Championship in Trichy

  • తిరుచ్చి రైఫిల్ క్లబ్ కు చేరుకున్న నటుడు
  • అభిమానుల నుంచి చక్కని స్వాగతం
  • తమిళనాడు రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొననున్న అజిత్

తమిళ అగ్ర నటుల్లో ఒకరైన అజిత్ కుమార్ రైఫిల్ పోటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 47వ తమిళనాడు రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఈ పోటీలు ఈ నెల 25న మొదలు కాగా, పోటీ రెండో దశలో పాల్గొనేందుకు అజిత్ తిరుచ్చి చేరుకున్నాడు. 

అజిత్ కు రైఫిల్ షూటింగ్ లో మంచి నైపుణ్యాలు ఉన్నాయి. 2021 తమిళనాడు స్టేట్ రైఫిల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆయన ఆరు మెడల్స్ సాధించడం గమనార్హం. దీంతో ఈ విడత కూడా పోటీల్లో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. 10 మీటర్లు, 25 మీటర్లు, 50 మీటర్ల విభాగంలో ఆయన ప్రాథమిక దశల్లో పాల్గొన్నారు. 

తిరుచ్చి రైఫిల్ క్లబ్ కు చేరుకున్న ఆయనకు అభిమానుల నుంచి మంచి స్పందన కనిపించింది. దీంతో ఆయన థంబ్స్ అప్ సంకేతం ఇచ్చారు. అజిత్ కుమార్ ఏకే 61 సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆ తర్వాత విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నటించనున్నారు.

Ajith Kumar
tamil
actor
Rifle Shooting Championship
Trichy
  • Loading...

More Telugu News