TDP: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధం: బుద్ధా వెంక‌న్న‌

budda venkanna says tdp ready to election any time

  • విశాఖ‌లో పార్టీ జోన్ 1 స‌మావేశం
  • ముఖ్య అతిథిగా హాజ‌రైన బుద్ధా వెంక‌న్న‌
  • ఉత్త‌రాంధ్ర‌లోని అన్ని సీట్ల‌ను గెలుస్తామ‌ని ధీమా

ఏపీలో ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా టీడీపీ సిద్ధంగా ఉంద‌ని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న అన్నారు. మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నంలోని పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన పార్టీ జోన్ 1 స‌మావేశానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. జోన్ 1లోని 35 నియోజక‌ ‌వ‌ర్గాలకు చెందిన ఇంచార్జీలు, అబ్జ‌ర్వ‌ర్లు ఈ కార్యక్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బుద్ధా వెంక‌న్న మాట్లాడుతూ... ఆగస్ట్ 30 లోగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. 

రాష్ట్రంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులకు ధన దాహం ఉందని వెంక‌న్న ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తున్న వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. మద్యనిషేధం పేరుతో డబ్బంతా తాడేపల్లికి వెళుతోంద‌ని ఆయ‌న తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలపై మాట్లాడిన నాయకుడిని ప్రభుత్వం ఇబ్బంది పెడితే.. ఆ నాయకుడి తరుపున పోరాటం చేస్తామ‌న్నారు. జగన్ పతనానికి ఉత్తరాంధ్ర నుంచే నాంది పలికామన్న బుద్ధా... ఉత్తరాంధ్రలోని 34 నియోజక వర్గాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్య‌క్తం చేశారు.

TDP
Budda Venkanna
Vizag
North Andhra
Andhra Pradesh
  • Loading...

More Telugu News