Apple 1: యాపిల్ తొలి కంప్యూటర్ చూశారా..? ఎంత వెరైటీగా వుందో!

Apple 1 computer owned by Steve Jobs is up for auction

  • 1976కు ముందు తయారు  చేసిన ప్రోటోటైప్ కంప్యూటర్
  • రూ.4 కోట్ల వరకు ధర పలకొచ్చని అంచనా
  • వేలం నిర్వహిస్తున్న ఆర్ఆర్ సంస్థ
  • ఇప్పటికే 2 లక్షల డాలర్లకు చేరిన బిడ్డింగ్

యాపిల్ తొలి తరం ప్రొటోటైప్ కంప్యూటర్ వేలానికి రానుంది. ఇది యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వాడినది. 1976కు ముందు ఆయన దీన్ని వినియోగించే వారు. వేలం నుంచి 5 లక్షల డాలర్లు (రూ.4 కోట్లు) రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్ఆర్  వేలం సంస్థ దీనికి వేలం వేయనుంది. ఇప్పటికే 2 లక్షల డాలర్లకు బిడ్డింగ్ చేరింది. 

ఆగస్ట్ 18 వరకు వేలం కొనసాగుతుంది. స్టీవ్ వోజ్నియాక్, ప్యాటీ జాబ్స్, డేనియల్ కొట్కే తో కలసి స్టీవ్ జాబ్స్ డిజైన్ చేసిన 200 కంప్యూటర్లలో ఇది కూడా ఒకటి. అయితే, ఈ కంప్యూటర్ పని చేయడం లేదట. స్టీవ్ జాబ్స్ స్వయంగా కొన్ని విడిభాగాలను తీసి వేరే కంప్యూటర్ కోసం వినియోగించి ఉంటారని వేలం నిర్వహించే సంస్థ తెలిపింది. గతంలో 2014లోనూ యాపిల్ తొలి తరం కంప్యూటర్ ఒకటి 9,05,000 డాలర్లు పలకడం గమనార్హం.

  • Loading...

More Telugu News