Ranveer Singh: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ దిగంబర అవతారంపై పోలీసులకు ఫిర్యాదు

Complaint against Bollywood star Ranveer Singh on his nude postures

  • ఇన్ స్టాగ్రామ్ లో రణవీర్ నగ్నఫొటోలు
  • ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ మోడలింగ్
  • రణవీర్ పై వెల్లువెత్తిన విమర్శలు
  • పోలీసులను ఆశ్రయించిన స్వచ్ఛంద సేవాసంస్థ

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన నగ్న ఫొటోలు దిగ్భ్రాంతి కలిగించాయి. ఒంటిమీద నూలు పోగు అనేది లేకుండా కొన్ని ఫొటోల్లో రణవీర్ సింగ్ తన దిగంబర అవతారాన్ని ప్రదర్శించాడు. పేపర్ మ్యాగజైన్ అనే మీడియా సంస్థ కోసం రణవీర్ ఈ మేరకు న్యూడ్ మోడలింగ్ చేశాడు. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 

రణవీర్ సింగ్ తన చర్యల ద్వారా మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా వ్యవహరించాడని, వారి మనోభావాలను దెబ్బతీశాడంటూ ముంబయిలోని చెంబూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రణవీర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఓ స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధి ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. ఐటీ యాక్ట్, ఇతర సెక్షన్ల కింద రణవీర్ సింగ్ పై కేసు నమోదు చేయాలని కోరారు. 

దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ పై ఫిర్యాదు అందిందని, అయితే తాము ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. ప్రాథమిక విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Ranveer Singh
Complaint
Police
Paper Magazine
Bollywood
  • Loading...

More Telugu News