Elephant: చెరుకు గడల కోసం లారీని అడ్డుకున్న ఏనుగులు.. వీడియో ఇదిగో

Elephants Block Sugar Cane Truck

  • వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన ఐఎఫ్ ఎస్ అధికారి
  • వీడియో ఆకట్టుకున్నా.. జంతువులపై సానుభూతితో ఆహారం పెట్టడం ప్రమాదకరమని వెల్లడి
  • అడవిలో జంతువులకు ఎలాంటి ఆహారం పెట్టవద్దని విజ్ఞప్తి

అదో అడవి.. ఓ పెద్ద ఏనుగు, మరో గున్న ఏనుగు రోడ్డు మీద కాపు కాశాయి.. అటుగా వెళ్తున్న ఓ చెరుకు లారీ కనబడగానే అడ్డు వచ్చి ఆపేశాయి. చాలా సేపటి వరకు కదలకుండా అలాగే నిలబడ్డాయి. లారీలో ఉన్న వ్యక్తి లేచి బయటికి వచ్చి వాటిని వెళ్లగొట్టాలని చూసినా కదల్లేదు. దాంతో లారీపైకి ఎక్కి కొన్ని చెరుకు గడలను తీసి రోడ్డు పక్కగా వేశాడు. అప్పుడుగానీ ఏనుగులు లారీ ముందు నుంచి కదల్లేదు. మొత్తంగా చెరుకు గడలు ఇచ్చేదాకా లారీని ఆపేశాయన్న మాట. తర్వాత లారీని వదిలేసి వెళ్లి చెరుకు గడలను తినడం మొదలుపెట్టాయి. ఎదురుగా వస్తున్న మరో వాహనంలోని వారు ఇదంతా వీడియో తీశారు.

ఐఎఫ్ ఎస్ అధికారి షేర్ చేయడంతో..
ఐఎఫ్ ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ) అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘ఇలా వసూలు చేసే పన్ను (ట్యాక్స్)ను ఏమంటారు?’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన పలు వివరాలను పోస్ట్ చేశారు.
  • ‘‘ఇది చూడటానికి సరదాగా కనిపిస్తుందిగానీ.. వన్య ప్రాణులకు ఇలా ఆహారం పెట్టడం అస్సలు మంచిది కాదు. వన్యప్రాణులను అడవి లోపల వాటి స్థానంలోనే ఉంచాలి. ఇలా ఆహారం పెడితే రోడ్లపైకి, మనుషులు ఉండే చోట్లకు వస్తాయి. అది ప్రమాదాలకు దారి తీస్తుంది.” అని ఐఎఫ్ ఎస్ అధికారి హెచ్చరించారు.
  • ఐఎఫ్ ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ పెట్టిన ఈ వీడియోను ఏకంగా 16 లక్షల మందికిపైగా చూడటం గమనార్హం. పెద్ద సంఖ్యలో షేర్ లు, కామెంట్లు కూడా వస్తున్నాయి. 

  • Loading...

More Telugu News