Akshay Kumar: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరో రికార్డు.. అత్యుత్తమ ఆదాయ పన్ను చెల్లింపుదారుగా ఐటీ శాఖ సర్టిఫికెట్

Akshay kumar recevies an award from Income tax department
  • ఇంటర్ నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్న ‘సమ్మాన్ పత్ర’ ధృవ పత్రం
  • గత ఐదేళ్లుగా బాలీవుడ్ నుంచి టాప్ ట్యాక్స్ పేయర్ గా ఉన్న అక్షయ్
  • ఆయన ఆదాయం ఎంత, ఎంత పన్ను చెల్లించారన్న వివరాలపై లేని స్పష్టత
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన సినిమాలతోనే కాదు ఇప్పుడు ఆదాయ పన్ను చెల్లింపులతోనూ అందరి దృష్టినీ ఆకర్షించారు. దేశంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో ఒకడిగా, అత్యుత్తమ ఐటీ చెల్లింపుదారుగా పేర్కొంటూ ఐటీ శాఖ ఆయనకు తాజా సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. ఇప్పుడా సర్టిఫికెట్ ఇంటర్ నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐదేళ్లుగా టాప్ లోనే..
బాలీవుడ్‌ లో వేగంగా సినిమాలు చేసే నటుడిగా అక్షయ్ కుమార్ కు పేరుంది. ఏటా ఆయనకు సంబంధించి నాలుగైదు సినిమాలు వస్తుంటాయి. భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారన్న పేరు కూడా ఉంది. ప్రముఖ కంపెనీలకు ఆయన ప్రచార కర్తగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదాయ పన్ను శాఖ ‘సమ్మాన్ పత్ర’ అవార్డు అందుకోవడం గమనార్హం. గత ఐదేళ్లుగా కూడా ఆయన బాలీవుడ్ నుంచి అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు. అయితే ఆయన ఆదాయం ఎంత, ఎంత పన్ను చెల్లించారనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన హీరోగా, భూమి పెడ్నేకర్ నటించిన ‘రక్షా బంధన్’ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు. 

Akshay Kumar
Bollywood
IT
Income Tax
IT Award
Cinema
Cinema News

More Telugu News