Maharashtra: షిండే సీఎం కావడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్

Maharashtra BJP chief sensational comments on Shinday becoming CM

  • ఫడ్నవిస్ కు బదులుగా షిండేను సీఎం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది
  • బరువైన గుండెతో అధిష్ఠానం నిర్ణయాన్ని అంగీకరించాం
  • ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర నేతలంతా బాధపడ్డాం

బీజేపీ అండతో శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫడ్నవిస్ ని డిప్యూటీ సీఎంని చేయడం చాలా మందికి మింగుడుపడలేదు. తాజాగా ఈ అంశానికి సంబంధించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ... ఫడ్నవిస్ కు బదులుగా షిండేను సీఎంగా చేయాలని బరువైన గుండెతో పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. షిండేకు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించడంపై తాము ఎంతో బాధపడ్డామని తెలిపారు. మరో ఆప్షన్ లేకపోవడంతో... అధిష్ఠానం నిర్ణయాన్ని అంగీకరించామని చెప్పారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర బీజేపీ నేతలందరం కలత చెందామని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 

మరోవైపు నిన్న ఓ కార్యక్రమంలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ... షిండే సర్కార్ ఎక్కువ కాలం కొనసాగదని చెప్పారు. థాకరే ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే పాటిల్ పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Maharashtra
BJP
Eknath Shinde
Devendra Fadnavis
Uddhav Thackeray
Shiv Sena
  • Loading...

More Telugu News