Mumbai: ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో స‌ల్మాన్ ఖాన్‌... వైర‌ల్ అవుతున్న వీడియో ఇదిగో

salman khan meets mumbai police commissioner
  • నెల క్రితం స‌ల్మాన్‌కు బెదిరింపుల లేఖ‌
  • ఇటీవ‌లే ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వివేక్‌
  • క‌మిష‌న‌ర్‌తో భేటీ త‌ర్వాత మీడియాతో మాట్లాడ‌కుండా వెళ్లిన స‌ల్మాన్‌

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ శుక్రవారం సాయంత్రం ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి వెళ్లారు. ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌తో భేటీ అనంత‌రం ఆయ‌న కాసేప‌ట్లోనే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. పోలీస్ క‌మిష‌నర్‌ను క‌లిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడ‌కుండానే సల్మాన్ వెళ్లిపోయారు. దీంతో ఏ కార‌ణంతో ఆయ‌న పోలీస్ కమిష‌న‌ర్‌ను క‌లిశార‌న్న అంశం తెలియరాలేదు.  

అయితే, ఓ నెల క్రితం స‌ల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదిరింపులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వహారంపై స‌ల్మాన్ పెద్ద‌గా స్పందించ‌లేదు. అంతేకాకుండా ఆయ‌న స్వ‌యంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. మ‌రోవైపు ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌గా వివేక్ ఫ‌న్సాల్క‌ర్ ఇటీవ‌లే బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. వెర‌సి త‌న‌కు వ‌చ్చిన బెదిరింపుల‌పై కొత్త పోలీస్ క‌మిష‌న‌ర్‌తో చ‌ర్చించేందుకే స‌ల్మాన్ వెళ్లి ఉంటార‌న్న ఊహాగానాలు వినిసిస్తున్నాయి.

  • Loading...

More Telugu News