SBI: వాట్సాప్ నుంచే ఎస్ బీఐ బ్యాలన్స్ చూసుకోవచ్చు!

SBI users can now check bank account balance through WhatsApp
  • వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన ఎస్ బీఐ
  • ఫోన్ నుంచి రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు
  • అనంతరం కావాల్సిన సమాచారం పొందే సౌలభ్యం
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్ బీఐ తన ఖాతాదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. దీనివల్ల ఎస్ బీఐ బ్యాంకింగ్ సేవల కోసం ఖాతాదారులు వేరే ఏ యాప్ కూడా డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. 

అకౌంట్ బ్యాలెన్స్ ఎంతుందో వాట్సాప్ ద్వారా చూసుకోవచ్చని, మినీ స్టేట్ మెంట్ కూడా పొందొచ్చని ఎస్ బీఐ ప్రకటించింది. ఈ సేవల కోసం ఎస్ బీఐ ఖాతాదారులు ముందుగా నమోదు చేసుకోవాలి. ఇందుకోసం తమ ఫోన్ నుంచి 7208933148 నంబర్ కు “SMS WAREG A/c No” అంటూ ఎస్ఎంఎస్ పంపించాలి. బ్యాంకులో రిజిస్టర్ అయిన నంబర్ నుంచే ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది. 

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 9022690226కు Hi అంటూ మెస్సేజ్ పంపించాలి. అప్పుడు ‘డియర్ కస్టమర్ వెల్ కమ్ టూ ఎస్ బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్’ అనే సందేశం వస్తుంది. అకౌంట్ బ్యాలెన్స్, మినీ  స్టేట్ మెంట్, డీ రిజిస్టర్ ఫ్రమ్ వాట్సాప్ బ్యాంకింగ్.. ఇలా కావాల్సిన సేవలను పొందొచ్చు. అక్కడ చూపించే ఆప్షన్లను ఎంపిక చేసుకుంటే కావాల్సిన సమాచారం లభిస్తుంది.
SBI
whatsapp banking
account balance

More Telugu News