President Of India: ఎంపీల ఓట్ల‌లో ముర్ముకే ఆధిక్యం... 15 ఓట్లు చెల్ల‌ని వైనం

draupadi murmu got 540 votes of mp votes

  • కొన‌సాగుతున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు
  • ముగిసిన ఎంపీల ఓట్ల లెక్కింపు
  • ముర్మ‌కు పోలైన ఓట్లు 540
  • య‌శ్వంత్ సిన్హాకు 208 ఓట్లే వ‌చ్చిన వైనం

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఫ‌లితం తేల్చే ఓట్ల లెక్కింపు గురువారం ఉద‌యం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలోని పార్ల‌మెంటు వేదిక‌గా జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపులో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యానికి ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఓట్ల లెక్కింపులో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము స్ప‌ష్ట‌మైన ఆధిక్యం సంపాదించారు.

ఎంపీల ఓట్ల‌లో ముర్ముకు 540 ఓట్లు రాగా, వాటి విలువ 3,78,000గా అధికారులు నిర్ధారించారు. ఇక‌ విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు కేవ‌లం 208 ఓట్లు మాత్ర‌మే రాగా.. వాటి విలువ‌ 1,45,600గా తేలింది. ఇక పోలైన ఎంపీల ఓట్ల‌లో 15 ఓట్లు చెల్ల‌కుండా పోవ‌డం గ‌మ‌నార్హం. గురువారం సాయంత్రంలోగా విజేత ఎవ‌ర‌న్న‌ది తేలిపోనుంది.

President Of India
President Of India Election
Draupadi Murmu
Yashwant Sinha
NDA
  • Loading...

More Telugu News