Palnadu District: పల్నాడులో బోల్తా కొట్టిన ఆయిల్ ట్యాంకర్.. బిందెలు, క్యాన్లతో ఎగబడుతున్న జనాలు!

Oil tanker accident in Palnadu
  • నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద బోల్తాకొట్టిన ఆయిల్ ట్యాంకర్
  • క్షణాల్లో సమీప గ్రామాలకు వ్యాపించిన సమాచారం
  • దొరికినకాడికి ఆయిల్ తీసుకెళ్తున్న జనాలు
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టింది. ఈ విషయం క్షణాల్లో సమీప గ్రామాలకు వ్యాపించింది. ఇంకేముంది... ప్రమాదం జరిగిన ప్రాంతానికి జనాలు పోటెత్తారు. ఆడ, మగ అనే తేడా లేకుండా బిందెలు, క్యాన్లు, బక్కెట్లు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని ఆ ప్రాంతానికి ఎగబడ్డారు. దొరికినకాడికి ఆయిల్ నింపుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ట్యాంకర్ ప్రమాదానికి గురైనట్టు సమాచారం.
Palnadu District
Oil Tanker
Accident

More Telugu News