Sanjay Raut: నేడు విచారణకు రండి.. సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు

Sanjay Raut Summoned By Enforcement Directorate

  • మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌత్
  • ఈ నెల 1న 10 గంటలపాటు విచారణ
  • ఈడీ దర్యాప్తునకు సహకరిస్తానన్న రౌత్

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోమారు సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాలని అందులో కోరింది. పత్రా చాల్ హౌసింగ్ కాంప్లెక్స్ పునరాభివృద్ధిలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనను జులై 1న దాదాపు 10 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఇదే కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో రౌత్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

ఈడీ సమన్లపై అప్పట్లో స్పందించిన రౌత్.. దీనిని కుట్రగా అభివర్ణించారు. దర్యాప్తు చేయడం ఈడీ కర్తవ్యమని, తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. ఈ రోజు వాళ్లు తనను పిలవడంతో వచ్చానని, ఈడీకి సహకరిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. కాగా, పీఎంసీ బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో రౌత్ భార్య వర్షారౌత్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది.

Sanjay Raut
Shiv Sena
ED
Money Laundering
  • Loading...

More Telugu News