Bhadrachalam: భ‌ద్రాద్రిపై తెలంగాణ ప్ర‌భుత్వానిది స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌: ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని

perni nani comments on bhadrachalam floods

  • భ‌ద్రాచ‌లం వ‌ర‌ద ముంపుపై వివాదం
  • తెలంగాణ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు ఏపీ నేత‌ల కౌంట‌ర్లు
  • భ‌ద్రాద్రిపై తెలంగాణ‌కు ప్రేమ లేద‌న్న పేర్ని నాని
  • యాదాద్రి మాదిరి భ‌ద్రాద్రిని ఎందుకు అభివృద్ధి చేయ‌ర‌ని ప్ర‌శ్న‌

తాజా వ‌ర‌ద‌ల్లో భ‌ద్రాచ‌లం ముంపున‌కు గురి కావ‌డం, ఇందుకు పోల‌వ‌రం ప్రాజెక్టే కార‌ణ‌మంటూ తెలంగాణ‌కు చెందిన నేత‌లు వ్యాఖ్యానించ‌డంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం నెల‌కొంది. ఈ వివాదంపై స్పందించేందుకు మంగ‌ళ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన ఏపీ మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

భ‌ద్రాద్రిపై తెలంగాణ ప్ర‌భుత్వం స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపుతోంద‌ని ఆయన ఆరోపించారు. యాదాద్రి ఆల‌యాన్ని పునర్నిర్మించిన‌ట్లుగా భ‌ద్రాద్రి ఆలయానికి నిధులు కేటాయించి ఎందుకు అభివృద్ధి చేయ‌ర‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ‌కు భ‌ద్రాద్రిపై ప్రేమ లేకుంటే ఏపీకి ఇచ్చేయండి అని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్లే భ‌ద్రాద్రి ముంపున‌కు గురి అయ్యింద‌న‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని నాని పేర్కొన్నారు.

Bhadrachalam
Telangana
Andhra Pradesh
Polavaram Project
Perni Nani
  • Loading...

More Telugu News